హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఏ ఒక్క ఓటరుకూ నష్టం జరగొద్దు'

నిర్మల్ ఓటర్ల పరిశీలన ప్రక్రియను ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని నిర్మల్ ఆర్డీవో దేవిదాస్ తెలిపారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. బుధవారం తహశీల్దార్లు, రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరుకూ నష్టం వాటిల్లకుండా సిబ్బంది, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.