హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుంది'

పార్వతీపురం మున్సిపల్ ఎన్నికలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.