VSP: గాజువాక 87వ వార్డు పరిధిలోని వడ్లపూడి బస్‌స్టాప్‌ను శాశ్వత బస్‌స్టాప్‌గా ప్రకటించి అన్ని ఆర్టీసీ బస్సులు నిలిచేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం కోరారు. ఈ మేరకు బుధవారం కూర్మన్నపాలెం డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. వడ్లపూడిలో 28 వేల మంది నివసిస్తున్నారని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు ఆధారపడ్డారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'బస్‌స్టాప్‌ను శాశ్వతం చేయాలి'


