WNP: మండలంలోని కృష్ణగిరి గ్రామంలో భూ తగాదాల నేపథ్యంలో తిమ్మన్న, అతని భార్య మాధవిపై దాడి జరిగినట్లు ఫిర్యాదు అందింది. సెప్టెంబర్ 29న ఉదయం 6:30 గంటల సమయంలో బాలస్వామి కుటుంబానికి చెందిన పలువురు తిట్టి, కొట్టి గాయపరిచినట్లు తిమ్మన్న బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఎస్సై రిషికేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
భూ తగాదాలతో దంపతులపై దాడి.. కేసు నమోదు


