హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా

ADB: ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో బుధవారం లైసెన్స్ మేళా నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రత్యూష ఆధ్వర్యంలో నిర్వహించిన మేళాలో పలువురు వ్యాపారులు లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఆహార, తినుబండారాల విక్రయ కేంద్రాల వారు ఆహార భద్రతా శాఖ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. లైసెన్స్ లేకుండా షాపులు నిర్వహిస్తే సీజ్ చేస్తామన్నారు.