హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేణిగుంటలో 48 రోజులపాటు పలు రైళ్ల రద్దు

KDP: రేణిగుంట రైల్వే యార్డులో చేపట్టనున్న పనుల నేపథ్యంలో నవంబర్‌ 10నుంచి 48 రోజులపాటు పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కడప–నెల్లూరు ప్యాసింజర్‌ రైళ్లు 48 రోజులు, చెన్నై–తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ 27 రోజులు రద్దు కానున్నాయి. తిరుపతి–విశాఖపట్నం డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరికొన్ని రైళ్లను రద్దు చేయనున్నారు.