హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి: JAC

W.G: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం నరసాపురం MPDO ఎం. నాసరు రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ భద్రత, బదిలీలు, పదోన్నతులు కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో మరణిస్తే రూ.25 లక్షల ఎక్స్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.