హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వీఆర్ఏల వంటా-వార్పు నిరసన

కృష్ణా: ఉంగుటూరు మండల కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మె బుధవారం 15వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉంగుటూరు, గన్నవరం, బాపులపాడు మండలాలకు చెందిన వీఆర్ఏలు ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వంటా-వార్పు చేపట్టారు. రోడ్డుపైనే వంటలు వండి సహపంక్తి భోజనం చేశారు. పే-స్కేల్ అమలు, అర్హులకు పదోన్నతులు, వారసత్వ నియామకాల జీవో సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.