GDWL: వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ బుధవారం అలంపూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది బ్యారక్స్, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేసి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్టేషన్ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ


