హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనాథ వృద్ధాశ్రమాల నిర్వాహకులతో కలెక్టర్ సమావేశం

HNK: అనాథ వృద్ధాశ్రమాల్లో సేద తీరుతున్న వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకుల పైనే ఉందని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని 10 అనాధ వృద్ధాశ్రమాల నిర్వాహకులతో బుధవారం రాత్రి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజా పాల్గొన్నారు.