హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిటైరైన పోలీస్ అధికారులకు సన్మానం..!

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన ఎస్సై ఎస్.కె. సర్దార్, స్వీపర్ డి. హైమావతి, హోంగార్డ్ జి. సైదులును సీపీ సునీల్ దత్ ఘనంగా సన్మానించారు. సుదీర్ఘకాలం వారు అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఆర్‌ఐలు కామరాజు, సురేష్, పోలీస్ సంఘాల నేతలు పాల్గొన్నారు.