హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 2,54,872 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 269 మంది స్వామివారిని దర్శించుకున్నారన్నారు. అలాగే, 30 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 1695 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.