హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాపేశ్వరం పంచాయతీలో ఓటర్ల జాబితాపై సమీక్ష

కోనసీమ: మండపేట మండలం తాపేశ్వరం పంచాయతీ కార్యాలయంలో జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకురాలు కె. మాధవీలత ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఫారం-6, ఫారం-8 దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, తిరస్కరించిన దరఖాస్తులను పునఃపరిశీలించాలని అధికారులకు సూచించారు. ఓటర్ల వివరాల సవరణకు వచ్చిన దరఖాస్తులను ఆధారాలతో నిశితంగా పరిశీలించాలని తెలిపారు.