హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాఠశాల భూమిపై కొత్త నిర్మాణాలు వద్దు'

కోనసీమ: అమలాపురం మండలం బండారులంక జెడ్పీ ఉన్నత పాఠశాల అవసరాల కోసం దానం చేసిన భూమిపై ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టవద్దని దాతల కుటుంబీకులు, పూర్వ విద్యార్థులు కోరారు. సర్వే నంబర్‌ 144/2లోని 2.37 ఎకరాల భూమిని 1992లో పాఠశాల అవసరాల కోసం దానం చేసినట్లు పేర్కొంటూ కలెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌. మహేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.