హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోషణ మాసం సందర్భంగా అవగాహన కార్యక్రమం

KMR: నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట్ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా మహిళలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమతుల్య పోషకాహారం ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు. అలాగే SAM, MAM పిల్లల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి, వారి పోషణపై తల్లులకు అవసరమైన సూచనలు అందించారు.