హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనిగిరి మున్సిపాలిటీకి జేసీబీ

ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషి, చొరవతో కనిగిరి మున్సిపాలిటీకి జేసీబీ మంజూరైంది. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ జేసీబీని కొనుగోలు చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జేసీబీ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.