హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురం డీఆర్వోగా శ్రీదేవి బాధ్యతలు

మార్కాపురం జిల్లా డీఆర్వోగా ఎం. శ్రీదేవి బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు డీఆర్వోగా పనిచేస్తూ బదిలీపై మార్కాపురం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది, పలువురు తహసీల్దార్లు పుష్పగుచ్ఛాలతో ఆమెను అభినందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతను శ్రీదేవి మర్యాదపూర్వకంగా కలిశారు.