హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

VZM: గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు. మయూరి కూడలి నుంచి బాలాజీ జంక్షన్ వరకు బుధవారం జరిగిన ర్యాలీని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ జెండా ఊపి ప్రారంభించారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండి విద్య, క్రీడలు, ఉపాధి, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు.