హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘దళితులపై దాడి చేస్తున్నారు’

BHPL: మొగుళ్లపల్లి మండలం పోతుగల్లులో దళిత కుటుంబాలు 30 ఏళ్లుగా లోడింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాయని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు అంబాల చంద్రమౌళి మాదిగ తెలిపారు. కొందరు అగ్రకులాలకు చెందిన వ్యక్తులు తమకు కూడా పనులు కావాలంటూ..దళితులు చేస్తున్న పనులకు ఆటంకం కలిగిస్తూ దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఘటనపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.