హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

BDK: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం భద్రాచలం సెంటర్‌లో BJP జిల్లా నాయకుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. శ్రీరాముడిని ధనికుల దేవుడిగా, పరమశివుడిని పేదల దేవుడిగా అభివర్ణించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శించారు.