హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఎం సూర్య ఘర్‌పై అవగాహన శిబిరం

MLG: పీఎంసూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 1నుంచి 3వరకు TGNPDCL కార్యాలయంలో సేవాసేతు శిబిరం నిర్వహిస్తామని జిల్లా సర్కిల్ ఎస్‌ఈ బిక్షపతి తెలిపారు. రూఫ్‌ టాప్ సోలార్, కేంద్ర ఆర్థిక సాయం, నెట్ మీటరింగ్, బ్యాంకు రుణాలపై అవగాహన కల్పించనున్నారు. ఆసక్తి ఉన్నవారు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.