ASR: అరకు పంచాయతీ నెరేడువలస పాఠశాల ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తామర్ల సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ విషయంపై సెప్టెంబర్ 19న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి'


