హైదరాబాద్: 28°C
తెలంగాణ

మణుగూరు–హైదరాబాద్‌ బస్సులు కొనసాగించాలి: సీపీఐ

BDK: మణుగూరు మండలంలో ప్రయాణికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ నాయకులు ఆర్టీసీ డీఎం శ్యాంసుందర్‌కు వినతిపత్రం అందజేశారు. మణుగూరు–హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను కొనసాగించాలని, కొత్తగూడెంకు అదనపు బస్సులు నడపాలని కోరారు. రాత్రి 9 తర్వాత ఖమ్మం నుంచి మణుగూరుకు, సాయంత్రం గుండాలకు అదనపు ట్రిప్పు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.