హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పౌర హక్కులపై అవగాహన అవసరం: కలెక్టర్

సత్యసాయి:  పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. లేపాక్షి మండలం పి. సడ్లపల్లిలో బుధవారం పౌర హక్కుల దినోత్సవంలో మాట్లాడారు. సమాజంలో సమానత్వం, న్యాయం అందించేలా అధికారులు పనిచేయాలన్నారు. ఆడపిల్లలకు 18 ఏళ్ల వరకు ఉన్నత విద్య అందించాలని.. ఎస్సీ, ఎస్టీలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.