హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొచ్చర్లలో సీసీ రోడ్లకు శంకుస్థాపన

PLD: ఈపూరు(M) కొచ్చర్లలో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, నిర్మాణానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో రూ.10 కోట్లతో సీసీ రోడ్లు, రూ.5 కోట్లతో బీటీ రోడ్ల పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మల్లికార్జునరావు పాల్గొన్నారు.