ఆసియా క్రీడల మహిళల హాకీ విభాగంలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్ పోరులో బలమైన సౌత్ కొరియా జట్టును 2-0 తేడాతో ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. భారత డిఫెండర్లు సౌత్ కొరియాకు ఒక్క గోల్ చేసే అవకాశమూ ఇవ్వకుండా అద్భుతంగా కట్టడి చేశారు. అక్టోబర్ 2న జరిగే స్వర్ణ పతక పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాతో భారత్ తలపడనుంది.
క్రీడలు
హాకీలో ఫైనల్ దూసుకెళ్లిన టీమిండియా


