హైదరాబాద్: 28°C
క్రీడలు

కేఎల్ రాహుల్ @100

వెస్టిండీస్‌తో జరుగుతున్న ఈ రెండో వన్డే ద్వారా KL రాహుల్ 100 వన్డేల మైలురాయిని చేరుకున్నాడు. 2016లో జింబాబ్వేపై రాహుల్ తన తొలి వన్డే ఆడాడు. అరంగేట్రం మ్యాచ్‌‌లోనే శతకం సాధించిన రాహుల్.. ఈ ప్రత్యేకమైన 100వ మ్యాచ్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. ఇప్పటివరకు 8 సెంచరీలు, 20 అర్ధశతకాలతో వన్డేల్లో 3,412 పరుగులు చేశాడు.