హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ రైతులకు ఎమ్మెల్యే కోట్ల సన్మానం

NDL: డోన్ మండలంలోని ఉత్తమ రైతులను ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి సన్మానించి, వారితో కలిసి భోజనం చేశారు. రాయలసీమను ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 2030 నాటికి ఉద్యాన సాగు విస్తీర్ణం 14.41 లక్షల హెక్టార్లకు పెంచడమే లక్ష్యమన్నారు.