హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి పది రోజుల గడువు

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి సందర్శించి రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. భూ భారతి, రీ-సర్వే, ధ్రువీకరణ పత్రాలు, కల్యాణలక్ష్మి, ఎఫ్-లైన్ పిటిషన్ల పెండింగ్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం 10 రోజుల్లోగా పూర్తిచేసి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.