హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్యాసింజర్ రైలు రీ షెడ్యూల్

విశాఖ నుంచి భవానిపట్నం వెళ్లే ప్యాసింజర్ రైలు (58504) రీ షెడ్యూల్ అయింది. విశాఖలో బుధవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సినరైలు ఇవాళ రాత్రి 7 గంటలకు బయలుదేరనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్య కారణంగా రైలు రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు. కావున, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.