కృష్ణా: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. గూడూరు మండలం తరకాటూరు, తరకాటూరుపాలెం గ్రామాల్లో రూ.80 లక్షలతో చేపట్టనున్న 2 రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. రహదారుల నిర్మాణంతో గ్రామస్థుల రాకపోకలకు సౌకర్యం కలుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నూతన రహదారి నిర్మాణానికి శ్రీకారం


