హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీఆర్‌ నీటిపై రైతులకు అన్యాయం చేయొద్దు: శైలజానాథ్

ATP: ఎంపీఆర్‌ రిజర్వాయర్ కాలువలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని శింగనమల వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. గార్లదిన్నె మండలంలో రైతు, వామపక్ష నేతలతో కలిసి రిజర్వాయర్, కాలువలను పరిశీలించారు. పంటలు ఎండిపోతున్నందున డ్యామ్ నుంచి నీటిని వదలకపోతే వైసీపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.