హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కమిషనర్‌పై సీఐటీయూ నిరసన

KRNL: ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీ.ఎస్‌. రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. కర్నూలులోని సుందరయ్య జంక్షన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.