హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాల టూ టౌన్ సీఐగా సుధాకర్

నంద్యాల పట్టణంలో బుధవారం టూటౌన్ సీఐగా సుధాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐని పట్టణంలోని ముస్లిం మైనార్టీ సంఘాల వారు మర్యాదపూర్వకంగా కలిశారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు మరిన్ని సేవలను అందజేస్తానని ఆయన అన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీలేకుండా బాధ్యతగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.