హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హిందూపురాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

సత్యసాయి: హిందూపురాన్ని చెత్త రహిత సుందర పట్టణంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. 'స్వచ్ఛత హి సేవ - 2026'లో భాగంగా బుధవారం మున్సిపల్ ఆవరణలో 'వేస్ట్ టు వెల్త్' ప్రదర్శనను ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. చెత్త సేకరణ కోసం 6 ఇ-ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు.