ATP: ఉరవకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వజ్రకరూరుకు చెందిన ముగ్గురి కుటుంబాలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం ఆర్థిక సాయం అందించారు. ఉరవకొండ క్యాంపు కార్యాలయంలో జైనుల్లా, మహబూబ్ బాషా, మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులకు ఈ సాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాలకు అండగా మంత్రి పయ్యావుల


