హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోషకాహార లోపాలపై అవగాహన సదస్సు

CTR: ప్రతి ఒక్కరికీ సమతుల్య పోషకాహారం ఎంతో అవసరమని పులిచెర్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ వాణిశ్రీదేవి సూచించారు. సదుం మండలంలోని పుట్టావారిపల్లె అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసోత్సవంలో పాల్గొన్నారు. గర్భవతులు, బాలింతలు తప్పనిసరిగా క్రమం తప్పకుండా సరైన పోషకాహారం తీసుకోవాలన్నారు. పోషకాహార లోపంతో తలెత్తే సమస్యలు వివరించారు.