హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రాలయం టీడీపీకి అభినందనలు

కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎన్‌.రాఘవేంద్రరెడ్డి హాజరయ్యారు. ‘ఇంటింటికి తెలుగుదేశం’లో మంత్రాలయం నియోజకవర్గం 89 శాతం లక్ష్యాన్ని సాధించడంపై ఆయనను కృష్ణమ్మ అభినందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నాయకులు చర్చించారు.