హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో రహదారి పనులకు శంకుస్థాపన

గుంటూరు నగరంలోని 47, 48వ డివిజన్లలో రూ.99.9 లక్షల వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు బుధవారం శంకుస్థాపన చేశారు. 47వ డివిజన్‌లో గోరంట్ల తూర్పు బజార్ కన్నా లక్ష్మీనారాయణ కాలనీ నుంచి భాష్యం టైటానిక్ క్యాంపస్ వరకు రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు.