హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ

PLD: మాచర్ల పట్టణ వైసీపీ కార్యాలయంలో బుధవారం 16వ వార్డు నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఐడీ కార్డులను పంపిణీ చేశారు. పార్టీ పటిష్టతకు, ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.