హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోడ కూలి 7 బైకులు ధ్వంసం

అనంతపురం సప్తగిరి సర్కిల్‌లోని మహిళా గ్రంథాలయం పాత గోడ బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో గోడకు సమీపాన ఉన్న సుమారు ఏడు బైకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. నాణ్యత లేని పాత గోడ కావడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.