MDCL: దొంగ డాక్టర్లపై SOT అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా కీసర, జవహర్‌నగర్, గోపాలపురం, మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వైద్య అర్హతలు, అనుమతులు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. వైద్య పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ
నకిలీ డాక్టర్లు అరెస్ట్..!


