హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐదు నెలలుగా తాగునీటి కష్టాలు

KRNL: మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామంలోని బీసీ కాలనీలో 5 నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి మోటారు పనిచేయక 111 ఇళ్లకు నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ఇవాళ 111 మంది సంతకాలతో పంచాయతీ కార్యదర్శి సోమశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.