హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల కమిషన్‌పై సమగ్ర దర్యాప్తు జరపాలి'

E.G: ఎన్నికల కమిషనర్ పనితీరు, జాబితాల సవరణలో అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతిని ఉద్దేశించి, సబ్‌కలెక్టర్‌కు మెమోరాండం అందజేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలన్నారు.