హైదరాబాద్: 28°C
క్రీడలు

అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ అరుదైన రికార్డులపై కన్నేశాడు. వన్డే క్రికెట్‌లో 12,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి రోహిత్.. కేవలం 73 పరుగుల దూరంలో ఉన్నాడు. ఒకవేళ ఇవాళ ఈ పరుగులు సాధిస్తే, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్‌గా.. ప్రపంచవ్యాప్తంగా ఏడో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.