హైదరాబాద్: 28°C
క్రీడలు

బాక్సింగ్‌లో భారత్‌కు కాంస్యం

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ కపిల్ పోఖరియా కాంస్య పతకం సాధించాడు. పురుషుల 90 కేజీల బాక్సింగ్ విభాగంలో అతడు ఈ ఘనత సాధించాడు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ తురాబెక్ ఖబీబుల్లావ్ చేతిలో 1-4 తేడాతో కపిల్ ఓడిపోయాడు. అయితే, ఆసియా క్రీడల బాక్సింగ్ నిబంధనల ప్రకారం సెమీస్‌లో ఓడిపోయిన ఇద్దరు బాక్సర్లకు కాంస్య పతకాలు అందిస్తారు. దీంతో కపిల్‌కు కాంస్యం లభించింది.