హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్చకుల జీతాలు పెంచాలి'

GNTR: తెనాలిలో బుధవారం జరిగిన ఏపీ అర్చక సమాఖ్య సమావేశంలో అర్చకుల సమస్యలపై నాయకులు చర్చించారు. అర్చకులకు జీతాలు పెంచాలని, వారి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్చకుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ఆర్గనైజింగ్ సెక్రటరీ టీ. అనంతాచార్యులు కోరారు.