SKLM: పొందూరులో ఖాదీ క్లస్టర్‌లో భాగంగా మహిళలకు ఉచిత చేనేత శిక్షణను ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం ప్రారంభించారు. సాయిబాబా వీవర్స్ సొసైటీలో DRDA-SERP ఆధ్వర్యంలో 20 మగ్గాలపై శిక్షణ ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలే మహారాణులని, శిక్షణతో స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా బలోపేతం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇందులో కలెక్టర్ స్వప్నల్ దినకర్ పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్
మహిళలకు ఉచిత చేనేత శిక్షణ ప్రారంభం


