హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోకులం షెడ్డు నిర్మాణానికి ఎంపీడీవో భూమిపూజ

NDL: సంజామల మండలం ముదిగేడులో బుధవారం ఎంపీడీవో సాల్మన్ పర్యటించి లబ్ధిదారులు సంధ్యారాణి, బాల వెంకటరెడ్డికి మంజూరైన మినీ గోకులం షెడ్డు, సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు సురేశ్‌బాబు, పరమేశ్వరుడు, ఏపీవో ప్రకాశ్, పీఎస్ విక్రమ్, AHA మహబూబ్ బేగ్ పాల్గొన్నారు.