హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ బలోపేతమే లక్ష్యం'

SKLM: వైసీపీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన జి.సిగడాం మండలం ఆనందపురం, దవలపేటలో కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలే పార్టీకి బలమని, ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.